ఏపీ రాజధానికి సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. రాజధాని పరిధిలోని అసంపూర్తి కట్టడాల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు చెబుతున్నారు. శాసన రాజధానికి అవసరమైన భవనాల నిర్మాణాన్ని మాత్రమే పూర్తి చేయాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. సెక్రటేరీయేట్, హోచ్వోడీ, శాశ్వత హైకోర్టు భవన నిర్మాణాల కొనసాగింపుపై ప్రభుత్వ నిర్ణయాన్నిఏఎమ్మార్డీఏ కమిషనర్ కోరినట్టు చెబుతున్నారు.
శాసన రాజధానికి అవసరమైన భవనాలు, హౌసింగ్ యూనిట్ ల నిర్మాణం ఖర్చు తగ్గించుకునేలా ప్రణాళికల రూపకల్పనపై సీఎస్ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా అసెంబ్లీ కార్యదర్శి, ఎమ్మార్డీఏ కమిషనర్ సహ జీఏడీ, పట్టణాభివృద్ధి, న్యాయ, ఆర్థిక, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులు ఉండనున్నట్టు చెబుతున్నారు.