సమాజంలో ప్రతి రంగం బ్యాంకింగ్ సిస్టం తో ముడి పడి ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో చాలావరకూ ప్రజలను పరిపాలించే ముఖ్యమంత్రులు బ్యాంకర్లతో సమావేశం అవుతోంది. అలాగే ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరిగింది. ఈ సమయంలో మహిళలకు వడ్డీ రేట్లపై బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు జగన్. రుణాల కోసం వచ్చే మహిళలతో సరిగ్గా బిహేవ్ చేయండి అంటూ చాలా సీరియస్ గా జగన్ కోప్పడుతూ మాట్లాడినట్లు సమాచారం. బ్యాంకులను అన్ని జిల్లాలలో డిజిటలైజేషన్ చేయాలని అదేవిధంగా కౌలు రైతులకు రుణాలు మంజూరు కోసం బ్యాంకులు ముందుకు రావాలి ఈ సందర్భంగా బ్యాంకర్లను కోరారు.
అంతేకాకుండా ఖరీఫ్ రుణ ప్రణాళిక పై సీఎం జగన్ మాట్లాడుతూ గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నామని వివరించారు. ఏది ఏమైనా గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆర్థికంగా ఎదిగేలా పరిస్థితులు తీసుకురావటానికి కృషి చేస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వటమే ప్రస్తుత గవర్నమెంట్ యొక్క లక్ష్యం అంటూ సీఎం జగన్ బ్యాంకర్లకు వివరించారు.