జగన్ ఎన్డియేలో చేరే అవకాశం ఉందా…?

-

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ ఎన్డియేలో చేరే అవకాశం ఉందా…? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అటు ఝార్ఖండ్ లో కూడా బిజెపి అధికారం కోల్పోయింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమితో దేశ ఆర్ధిక రాజధానిగా ఉన్న ముంబైని కోల్పోయింది బిజెపి. దీనితో ఇప్పుడు మోడిషాలో కలవరం మొదలయింది.

ఎప్పుడు ఎం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. బీహార్ ఎన్నికల్లో విజయం కూడా బిజెపికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా అవసరం. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ఉత్తరాది రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. వాస్తవానికి ఢిల్లీలో హిందూ ఓటు బ్యాంకు ఎక్కువ. ముస్లింలు ప్రభావితం చేసేది కేవలం 4 లేదా 6 స్థానాల్లో మాత్రమె. అయినా సరే బిజెపి విజయం సాధించలేదు.

దీనితో ఇప్పుడు కొత్త మిత్రపక్షాలను ఎన్డియేలో చేర్చుకునే ఆలోచన బిజెపి నేతలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దేశ రాజధాని తిన్న షాక్ నుంచి బిజెపి ఇప్పట్లో బయటకు వచ్చే విధంగా కనపడటం లేదు. అటు ప్రశాంత్ కిషోర్ కూడా చుక్కలు చూపిస్తున్నాడు. దీనితో వైసీపీ, తెరాస పార్టీలను ఎన్డియేలో చేర్చుకునే ఆలోచన బిజెపి చేస్తుంది. కెసిఆర్ నో అని చెప్పేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు వైసీపీ మీద గురిపెట్టి ఎన్డియేలో చేర్చుకునే విధంగా పావులు కదుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ బలం బిజెపికి తెలుసు కాబట్టి ఆయనతో కలిస్తే దక్షిణాదిలో ఎంతో కొంత బలం పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బిజెపి ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బలంగా ఉన్న జగన్ ని తమలో కలుపుకుంటే ఏ ఇబ్బంది ఉండదు అని బిజెపి భావిస్తుంది. ఈ మేరకు బుధవారం మోడీతో భేటీ అవుతున్న జగన్ చర్చించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news