దేశంలోనే జ‌గ‌న్ టాప్ రికార్డ్… మోడీని కూడా ఢీ కొట్టేస్తాడా…?

-

రాజ‌కీయాల‌కు.. సోష‌ల్‌మీడియాకు మ‌ధ్య మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్ర‌దానులు, అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రులు సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. మ‌రీ ముఖ్యంగా మ‌న దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అయితే.. ట్విట్ట‌ర్‌లో సంచ‌ల‌నాలు సృష్టించారు. భారీ ర్యాంకుతో ఆయ‌న దూసుకుపోయారు. వ్యూస్ నుంచి లైకుల వ‌ర‌కు ఆయ‌న అనేక రికార్డులు సొంతం చేసుకున్నారు. 2015లో ట్విట్ట‌ర్ అకౌంట‌ర్ ప్రారంభించిన ప్ర‌ధాని నిరంతరం.. దానిని అప్ డేట్ చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. తాను చెప్పాల‌నుకున్న దానిని ట్విట్ట‌ర్‌లో పంచుకుంటున్నారు.

దీంతో ప్ర‌ధాని మోడీ చేసే ట్వీట్ల‌కు భారీ సంఖ్య‌లో లైకులు ప‌డుతుంటాయి. దేశంలో ఇలా ఎక్కువ మంది ఫాలో అవుతున్న ట్విట్ల‌ర్లు చాలా కొద్ది మందికే ఉన్నాయి. వారిలో అమితాబ‌చ్చ‌న్‌.. ఆయ‌న కోడ‌లు ఐశ్వ‌ర్య‌రాయ్‌.. ఉంటడేవారు .. అయితే.. ప్ర‌ధాని వారిని కూడా ఓవ‌ర్ టేక్ చేసేశారు. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబ‌రు మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌లైన‌.. ట్విట్ట‌ర్‌, గూగుల్ సెర్చ్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌.. వంటి ప‌లు మాధ్య‌మాల్లో ఏ యే నాయ‌కులు దూసుకుపోతున్నారు. ఎవ‌రు ప్ర‌జ‌ల‌తో ఎలా ఇంట‌రాక్ష‌న్ అవుతున్నారు? అనే అంశాల‌పై చెక్‌బ్రాండ్ అనే ఆన్‌లైన్ ఎనాలిసిస్ సంస్థ‌.. విశ్లేష‌ణ చేసింది.

ఈ విశ్లేష‌ణ‌లో అనేక విష‌యాలు వెలుగు చూశాయి. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ.. దేశంలోనే టాప్ పొజిష‌న్‌లో ఉన్నారు. అత్య‌ధిక సంఖ్య‌లో ట్రెండ్ ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న నిలిచారు. దేశంలో మొత్తం 95 మంది రాజ‌కీయ నేత‌లు, 500 మంది వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌భావ శీలుర‌పై ఈ సంస్థ అధ్య‌య‌నం చేసింది.వీరిలో  క్రీడాకారులు, క‌ళాకారులు, సీనిరంగ ప్ర‌ముఖులు ఉన్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్రాల సీఎంలు, మంత్రులు కూడా ఉన్నారు. అయితే.,. వీరిలో ఎవ‌రూ కూడా మోడీని ఢీ కొట్ట‌లేక పోయారు.

ట్రెండింగ్‌లో ఆయ‌న‌కు 2171 పాయింట్లు వ‌చ్చాయి. అయితే.. మోడీ త‌ర్వాత ఈ జాబితాలో సీఎం జ‌గ‌న్ ఉన్నారు. అంటే.. మోడీ త‌ర్వాత సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌ల‌కు చేరువైన నాయ‌కుడిగా జ‌గ‌న్ నిలిచారు. ఆయ‌న‌కు 2137 ట్రెండ్స్ ప‌డ్డాయి. మొత్తంగా చూస్తే.. ఇదే ఒర‌వ‌డి కొన‌సాగితే.. జ‌గ‌న్ త్వ‌ర‌లోనే మోడీని ఢీ కొట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news