ఏపీలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ సీఎం జగన్ అనేక కొత్త కొత్త పధకాలను ప్రవేశ పెడుతున్నారు. ఈరోజు మరో కొత్త పథకాన్ని జగన్ సర్కార్ ప్రారంభించనుంది. జగనన్న జీవ క్రాంతి పథకం పేరుతో అమలు కానున్న ఈ పథకం ద్వారా గొర్రెలు, మేకలను అర్హులకు పంపిణీ చేస్తారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయస్సు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకలను అందజేయనున్నారు.
2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేసేందుకు రూ.1868.63 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఒక్కో లబ్ధిదారునికి ఒక యూనిట్ మాత్రమే పంపిణీ చేస్తారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అల్లానా ఫుడ్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నాణ్యమైన, ప్రాసెస్ చేసిన మాంసాన్ని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక దీనిని సచివాలయం నుండి ఏపీ సీఎం జగన్ ప్రారంబించనున్నారు.