ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తున్నా కేసులు గట్టిగానే నమోదవుతున్నాయి. అయితే మరణాల సంఖ్య భారీగా తగ్గటం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు. అయితే గతంలో సామాన్యులకి మాత్రమే పరిమితమైన ఈ కరోనా కేసులు ఇప్పుడు ప్రజా ప్రతినిధులకు కూడా భారీ సంఖ్యలో సోకుతున్నాయి.
ఇప్పటికే ఈ అసెంబ్లీ సెషన్స్ మొదలయ్యాక తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు లకి కరోనా సోకింది. ఇక తాజాగా నరసరావుపేట ఎంపీ అయిన లావు కృష్ణదేవరాయలుకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయం ఆయన తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. “నాకు కరోనా పాజిటివ్ అని తేలింది అయినా సరే నేను మరింత దృఢంగా బయటికి వస్తాను. నాతో 48 గంటల్లో కాంటాక్ట్ అయిన అందరికీ ఇదే నా విజ్ఞప్తి దయచేసి మీకు ఎలాంటి లక్షణాలు కనిపించినా కచ్చితంగా టెస్ట్ కి వెళ్ళండి” అని ఆయన కోరారు.
I have tested positive for Covid-19 but am in good spirits and will come out stronger. I request everyone who has come in contact with me in the last 48 hours to get tested if they see any symptoms
— Sri Krishna Devarayulu Lavu (@SriKrishnaLavu) December 9, 2020