శుభవార్త….ఈరోజే జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ..!

-

ఈరోజు తిరుపతి జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. అలానే నగరంలోని ఎస్వీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో జగనన్న విద్యా దీవెన డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

జగనన్న విద్యా దీవెన డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేడే పడనున్నాయి. టీటీడీ నిర్మించబోయే పిల్లలు ఆసుపత్రికి భూమి పూజ కూడా సీఎం చేతుల మీదుగా జరగనుంది. శ్రీనివాస సేతు వంతెనను సీఎం ప్రారంభించనున్నారు. ఇక విద్యా దీవెన పథకం గురించి చూస్తే.. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి 709 కోట్ల రూపాయలను 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లల ఖాతాల్లో విద్యా దీవెన డబ్బులు పడనున్నాయి.

తిరుపతి ఎస్వీ స్టేడియంలో సీఎం విద్యార్థుల తల్లల ఖాతాల్లోకి డబ్బులు వేయనున్నారు. ఇప్పటివరకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద రాష్ట్రం ప్రభుత్వం 10,994 కోట్ల రూపాయలు ఇచ్చింది. అలిపిరి వద్ద 6 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల వ్యయంతో శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని టీటీడీ మొదలు పెట్టనుంది.

ఈ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం జగన్ నేడు భూమి పూజ చేయనున్నారు. బర్డ్‌ ఆస్పత్రిలో వివిధ వార్డులను కూడా మొదలు పెట్టనున్నారు. శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌ను కూడా స్టార్ట్ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news