మంచు విష్ణు కోసం ఇండియన్ మైఖేల్ జాక్సన్..సన్నీ లియోన్, పాయల్‌తో చిందులు

-

డ్యాన్స్ కింగ్ గా పేరు గాంచిన హీరో ప్రభుదేవాను ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని పిలుస్తుంటారు. తెలుగు వారికీ సుపరిచితమైన ప్రభుదేవా..డ్యాన్సర్, హీరో, డైరెక్టర్, కొరియోగ్రాఫర్. కాగా, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఓ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయబోతున్నట్లు తెలిపారు. తాజాగా మరో న్యూస్ చెప్పేశారు డ్యాన్సింగ్ లెజెండ్.

మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు సినిమాలో ఓ సాంగ్ కొరియోగ్రఫీ చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేసేశారు. ‘గాలి నాగేశ్వరరావు’ టైటిల్ తో వస్తున్న ఈ పిక్చర్ ను అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ప్రొడ్యూస్ చేస్తు్న్నది.

ఈషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తుండగా, రైటర్ కోన వెంకట్‌ కథ, కథనం అందించడంతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ బాలీవుడ్ బ్యూటిఫుల్ భాబ సన్నీ లియోన్‌ ప్లే చేస్తున్నది. ‘రేణుక’ అనే కీలక పాత్రను సన్నీ లియోన్ పోషిస్తుండగా, ‘స్వాతి’గా పాయల్‌ రాజ్‌పుత్‌ కనిపించనుంది.

మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్ లపై సాంగ్ చిత్రీకరిస్తుండగా, దీనిని ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తుండటం విశేషం. ఈ పిక్చర్ కు మూలకథ డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి అందించగా, మ్యూజిక్ అనూప్‌ రూబెన్స్‌ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news