విద్యార్థులకు అలర్ట్‌.. ఈ నెల 12న జగనన్న విద్యా కానుక కిట్

-

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ 12వ తేదీ నుండి స్కూల్స్ పునఃప్రారంభమవుతాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం వెల్లడించారు. ఈ నెల 12న పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ ప్రభుత్వ పథకం జగనన్న విద్యా కానుక కిట్ లను విద్యార్థులకు అందిస్తారని తెలిపారు. దాదాపు రూ.2500తో జగనన్న విద్యా కానుక కిట్ లు ఇస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పదో తరగతి, ఇంటర్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కారం ఉంటుందన్నారు.

YSR Jagananna Vidya Kanuka Kits Scheme | Sakshi Special Story | Sakshi TV -  YouTube

” ఈ నెల 28న‌ అమ్మ ఒడి నిధులను సీఎం జగన్ విడుదల చేస్తారు. మొదటి దశలో 12 వేల స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్ ను 12 నుంచి ప్రారంభించబోతున్నాం. విద్యార్థులు అభివృద్ధి చెందాలని మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి, ఆరు నుంచి తొమ్మిది వరకు ప్రైమరీ జూనియర్ ను ప్రవేశపెడుతున్నాం. విద్యార్ధులకు బోధించే ఉత్తమ ఉపాధ్యాయులను విదేశాలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తాం. గోరు ముద్ద ద్వారా విద్యార్ధులకు మంచి భోజనం అందిస్తున్నాం. నూతన విద్యా విధానంలో మార్పులకు అనుగుణంగా ఏపీలో మార్పులకు శ్రీకారం చుట్టాం. ఫౌండేషన్ నుంచే‌ విద్యార్ధి ఎదుగుదలకు చర్యలు తీసుకుంటున్నాం. నిధుల విషయంలో ఎక్కడా రాజీపడడం లేదు. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ తో పాటు విద్యాకానుక ద్వారా అన్నీ అందిస్తున్నాం. విద్యార్ధులకు, తల్లిదండ్రులకు యూనిఫామ్ పై అవగాహన కల్పిస్తున్నాం. గత ఏడాదిలో చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి. ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. పూర్తి నాణ్యతతోనే విద్యా కానుక కిట్లను విద్యార్ధులకు అందిస్తున్నాం.” అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news