చిరులీక్స్‌.. ఈ సారి భోళాశంకర్‌ నుంచి వీడియో

-

మెగాస్టార్‌ చిరంజీవి ఈ మధ్య తాను నటిస్తున్న సినిమాల నుంచి లీకులు ఇస్తున్న విషయం తెలిసిందే. చిరు లీక్స్ పేరిట
ఇప్పటివరకు పలు షూటింగ్ స్టిల్స్ ను జనాల్లోకి వదిలిన బాస్ ఈసారి ఏకంగా ఓ వీడియోనే లీక్ చేశారు. అయితే.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళాశంకర్ చిత్రంలో నటిస్తున్నారు చిరంజీవి. అయితే.. భోళాశంకర్ సినిమాలో సంగీత్ నేపథ్యంలో వచ్చే ఈ పాట చిత్రీకరణ వీడియోను చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న తారాగణం అందరూ ఈ పాటలో ఉండడం విశేషం.

ఈ వీడియో లీక్ చేయడానికి ముందు చిరంజీవి ట్విట్టర్ లో హింట్ ఇచ్చారు. తాను మరోసారి లీక్ చేయబోతున్నానని, నేటి సాయంత్రం 5 గంటలకు ఇన్ స్టాగ్రామ్ లో ఆ లీక్ ఉంటుందని వెల్లడించారు. చెప్పినట్టుగానే ఇన్ స్టాలో సాంగ్ షూట్ వీడియోను పోస్టు చేశారు.

ఇందులో చిరంజీవి, తమన్నా, సుశాంత్, కీర్తి సురేశ్ లతో పాటు ఇతర నటీనటులందరూ కనువిందు చేశారు. ఇక ఈ వీడియో చివర్లో పాటకు సంబంధించిన చిన్న బిట్ ను కూడా పొందుపరిచారు. “జాం జాం జాం జాం జజ్జనక… తెల్లార్లూ ఆడుదాం తైతక్క” అంటూ సాగే ఆ హుషారైన పాటకు చిరు ఎనర్జటిక్ స్టెప్పులు వేసేందుకు రెడీ అవుతుండడం ఈ వీడియోలో చూడొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news