ముఖ్యమంత్రి కాదు మేనమామే… ఏపీ విద్యార్థులకు జగన్ కానుకలు!

-

తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ సామాన్యుడి బ్రతుకు చిత్రంపై పరిపూర్ణమైన అవగాహన కలిగి పనిచేస్తున్న వైఎస్ జగన్… సంక్షేమ కార్యక్రమాలా విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు! ఒకవైపు రెగ్యులర్ పరిపాలనతో పాటు… రైతుల గురించి, తల్లుల గురించి, టాక్సీ – ఆటొ డ్రైవర్ల గురించి, కాపు సంక్షేమం గురించి, దర్జీలు – నాయి బ్రాహ్మణుల గురించి… ఇలా అన్ని వర్గాల ప్రజల సంక్షేమ గురించి పక్కాగా ప్లాన్ చేసి, ఒక్కో పథకం అమలు చేస్తున్న జగన్… తాజాగా ఏపీ విద్యార్థులకు తనదైన కానుకలు సిద్ధం చేస్తున్నారు!

2020-21 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 7 రకాల వస్తువులను ఏపీ ప్రభుత్వం కానుకగా అందించనుంది. “జగనన్న విద్యా కానుక” కింద వీటన్నిటినీ కలిపి కిట్‌ రూపంలో ప్రతి విద్యార్థికి పంపిణీ చేయనున్నారు. ఈ కానుక కింద 3 జతల దుస్తుల వస్త్రం, ఒక బెల్టు, ఒక జత షూ, రెండు జతల సాక్స్ లు, పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్, స్కూల్‌ బ్యాగ్‌ అందిస్తారు. ఇక ఇచ్చిన దుస్తులు కుట్టించుకోవడానికి ఒక్కో జతకు కుట్టుకూలి కింద రూ.40 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ స్థాయిలో జగన్ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తుందనే కామెంట్లు ఈ సందర్భంగా వెలువడుతున్నాయన్న సంగతి అలా ఉంచితే… ఈ కార్యక్రమం కోసం కోసం ప్రభుత్వం రూ.650.60 కోట్లను వెచ్చిస్తోంది.

ఈ జనగన్న విద్యా కానుక పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 39.70 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుండగా… ప్రభుత్వ పాఠశాలలు తెరిచిన తొలి రోజునే ఈ 7 రకాల వస్తువులను విద్యార్థులకు అందించేందుకు సమగ్ర శిక్ష అభియాన్‌ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇదే క్రమంలో విద్యార్థులకు బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ఉచితంగా అందించనుండటంతోపాటు… ఇతర వాహనాల్లో వచ్చే వారికి అయ్యే ఛార్జీని కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ఇక ఇదే క్రమంలో విద్యార్థులకు తమకు ఇష్టమైన మాధ్యమంలో బోధన సాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news