ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సిబిఐ కోర్టు వచ్చే శుక్రవారం ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి అని ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే దీంతో అందరూ జగన్మోహన్ రెడ్డి ని మోడీ గట్టిగా టార్గెట్ చేశాడని అన్నారు. అప్పుడు తన హయాంలో మోడీతో కలిసి బాబు జగన్ పై అక్రమాస్తుల కేసులు పెట్టించారు అన్న విషయంపై కూడా చాలా చర్చ జరిగింది. ఇక వైఎస్ఆర్సిపి పార్టీ వ్యతిరేకస్థులు అయితే తమిళనాడులో శశికళ కు పట్టిన గతే ఇక్కడ జగన్ కు పడుతుందని మరియు జగన్ జైలు ఊసలు లెక్క పెట్టే రోజులు దూరంలో లేవని తెగ చిందులు వేశారు.
అయితే ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే మోడీ జగన్ ను ఎన్డీఏలో కలుపుకునేందుకు పనిలో పడ్డాడట. జగన్ గత ఎన్నికల్లో గెలిచిన భారీ మెజారిటీ తో వచ్చిన పాపులారిటీ కి తోడుగా కొత్తగా మూడు రాజధానుల ప్రతిపాదన తో ఇతర రాష్ట్రాల నుండి ఎంతో మంది ఇన్వెస్టర్లను ఆహ్వానించబోతున్నాడు. ఇప్పటికే ఆ విధంగా కార్యాచరణ మొదలుపెట్టిన వారి పార్టీ బృందం ఎంతో మంది ఇతర రాష్ట్ర మంత్రులను ఆకర్షిస్తుంది.
ప్రస్తుతం దేశంలో విపరీతమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న భాజపాకు జగన్ ఒక మంచి మంచి అవకాశం అని భావించవచ్చు. కావున మోడీ జగన్ పై ఎటువంటి చర్యలు పాల్పడే అవకాశం లేదు ఎందుకంటే జగన్ స్థాయి రాష్ట్రంలో శశి కలది కాదు జయలలితది