నేడే”జగనన్న విద్యా దీవెన” నిధులు విడుదల..11 లక్షల మందికి లబ్ది

-

ఏపీ విద్యార్థులకు జగన్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. నేడు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది జగన్‌ మోహన్ రెడ్డి సర్కార్‌. ఈ ఏడాది మూడో విడత లో భాగంగా… దాదాపు 11 లక్షల మందికి పైగా విద్యార్థుల కు ఏకంగా రూ. 686 కోట్లను నేడు ఏపీ వైఎస్ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి… విడుదల చేయనున్నారు.

Jagan
Jagan

ఈ కార్యక్రమాన్ని… ఇవాళ తన క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ విడుదల చేయనుంది జగన్‌ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news