విశాఖ రుషికొండ విషయంలో కోర్టులకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు .ఈ అంశాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తనన్నారు.సీఎంతో చర్చించి బాధ్యులపై చర్యలు ఖచ్చితంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బయట నుంచి వచ్చిన రెడ్లు ఉత్తరాంధ్రలో దందాలు చేశారని భారీగా భూ దోపిడీ జరిగిందని అన్నారు.దోపిడీకి గురైన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో జరిగిన భూ దోపిడీకి అధికార్లు సహకరించడం బాధాకరమని అన్నారు.ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై చర్యలు తప్పవని తెలిపారు. అద్దాల మేడలో ఉండి జగన్ కన్న కలలు చెదిరిపోయాయని అన్నారు. ఢిల్లీలో ఏపీ భవన్ అభివృద్ధి చేయలేదు కానీ జగన్ కోసం రుషికొండలో ఖరీదైన ప్యాలస్ అవసరమా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో బీజెపీ బలోపేతం కోసం కృషి చేస్తానని స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటి నుంచి దృష్టి పెట్టీ పనిచెయ్యాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖలో అద్భుతమైన శాశ్వత కార్యాలయం నిర్మిస్తామని పేర్కొన్నారు.