జగన్ అనంతపురం పర్యటన పై ఎమ్మెల్యే పరిటాల సునిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హెలికాప్టర్ దిగకుండా జగన్ వెనక్కి పంపే శక్తి ఉందంటూ వార్నింగ్ ఇచ్చారు పరిటాల సునిత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు అనంతపురం జిల్లాకు వెళ్లనున్నారు జగన్ మోహన్ రెడ్డి.
ఈనెల 08వ తేదీన అంటే రేపు.. పాపిరెడ్డి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు జగన్. జగన్ మోహన్ రెడ్డి పర్యటన పై స్థానిక లీడర్, ఎమ్మెల్యే పరిటాల సునిత కౌంటర్ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని రాకుండా ఆపే దమ్ము, ధైర్యం రెండు కూడా ఉన్నాయని ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఎక్కిన హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపే శక్తి కూడా ఉందని హెచ్చరించారు. మా కార్యకర్తలు, నాయకులు కూడా అదే కోరుకుంటున్నారని ఆమె చెప్పారు. కానీ మాకు చంద్రబాబు ఇలాంటి సంస్కృతి నేర్పలేదని వెల్లడించారు.