రేపు హైదరాబాద్ కు కేంద్ర హోమంత్రి అమిత్ షా.. షెడ్యూల్ ఖరారు

-

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. ముచ్చింత్ లోని రామానుజాచార్య సమతామూర్తి విగ్రహిాన్ని సందర్శించనున్నారు. ఈ మేరకు అమిత్ షా హైదరాబాద్ షెడ్యూల్ కూడా ఖరారైంది. రేపు సాయంత్రం 4.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రమానికి చేరుకుని.. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ముచ్చింతల్ లోని  శ్రీరామ నగరానికి చేరుకోనున్నారు. అక్కడ 108 దివ్యక్షేత్రాలను సందర్శించనున్న అమిత్ షా.. యాగశాల పూజల్లో పాల్గొననున్నారు. మళ్లీ రాత్రి 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రమం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. అమిత్ షా వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేయనుంది.

ముచ్చింతల్ లో సమతామూర్తి శ్రీ రామానుచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సమతామూర్తి విగ్రహాన్ని దేశ ప్రజలకు అంకితం చేశాడు. ప్రధాని మోదీ పర్యటన అనంతరం నుంచి ముచ్చింతల్ జన సంద్రంగా మారింది. ఈరోజు సమతామూర్తి విగ్రహ సందర్శనకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news