రైతులకు మరో శుభవార్త..భూ హక్కు పత్రాలపై జగన్‌ కీలక ప్రకటన

-

రైతులకు మరో శుభవార్త చెప్పారు సీఎం జగన్. భూ హక్కు పత్రాలపై జగన్‌ కీలక ప్రకటన చేశారు. భూ రికార్డులు సరిగా లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉందని… ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నా గతంలో ఎప్పుడూ పరిష్కారానికి ప్రయత్నం చేయలేదని వెల్లడించారు. రైతుల మానసిక వేదన, ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇటువంటి సమస్యలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు ఖర్చులతో సర్వే చేపట్టామన్నారు.

 


వేల సంఖ్యలో సర్వేయర్లను నియమించామని.. రికార్డులను పూర్తిగా అప్ డేట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. షరతులు గల పట్టాలు, చుక్కల భూములు వంటి సమస్యలను పరిష్కరించటానికి దీక్షగా ముందుకు వెళుతున్నామని.. నవంబర్‌లో 1500 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి హద్దులు నిర్ణయిస్తున్నామన్నారు. భూ హక్కు పత్రాలు కూడా ఇస్తామని.. గ్రామంలోనే రిజిస్ట్రేషన్ జరిగేటట్లు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటన చ ఏశారు. వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల గ్రామాల్లో సర్వే యఙం పూర్తి అవుతుంది.. 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేస్తున్నామన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాను.. దీని వల్ల సుమారుగా 22 వేల మంది రైతులకు వారి భూముల పై సర్వ హక్కులు రానున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news