సీఎం జగన్ ఐదేళ్ల పాలన ఓ పీడ కల అని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు అన్నారు.ప్రజాగళం’ యాత్రలో భాగంగా శనివారం నాడు గుంటూరు జిల్లాలోని పెదకూరపాడులో భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ , వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ అన్యాయం జరిగింది అని మండిపడ్డారు. ముస్లింలపై అనేక అరాచకాలు జరిగాయి. అధికారంలోకి రాగానే నదుల అనుసంధానం చేసి ప్రతీ ఎకరాకు నీళ్లందిస్తా. పేదలకు ఉచిత ఇసుక అందిస్తా. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం భవిష్యత్ కోసమే మూడు పార్టీలు కలిశాయి. రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది తమ కోసం కాదని రాష్ట్రం క్షేమం కోసమని ఆయన అన్నారు.రావణాసురుడిని చంపేందుకు వానర సైన్యమంతా కలిసిందని ఆక్షేపించారు. రాముడు దేవుడు అయినప్పటికీ వానరులతో కలిసి పోరాడారని పేర్కొన్నారు. వైసీపీ దోపిడీ దొంగలు కృష్ణా నది మీదనే రోడ్డు వేశారని ,ఇసుకాసురుడిని అంతం చేసి పేదలకు ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.