బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా పదవీకాలం పొడగింపు

-

బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా పదవీకాలం ఈనెల 20వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బిజెపి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించింది. 2024 జూన్ వరకు బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగనున్నారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు నడ్డా బిజెపి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు 2024లో జరిగే లోక్సభ ఎన్నికలు పూర్తయ్యేవరకు అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగనున్నారు. 2019 జూన్ లో నడ్డా బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. 2020 జనవరిలో నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమిత్ షా నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news