భారత ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కాసేపటి క్రితమే.. జగదీప్ ధన్ ఖర్ చేత భారత ఉప రాష్ట్రపతిగా ప్రమాణం చేయించారు. అనంతరం.. ఆయన భారత ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్నారు.
ఇక అంతకు ముందు.. రాజ్ ఘాట్ కు వెళ్లిన జగదీప్ ధన్ ఖర్ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్ కు వెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు. వెంకయ్య నాయుడు పదవీ కాలం నిన్నటి తో ముగియడంతో.. ఇవాళ్టి నుంచి భారత ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖర్ చేపట్టనున్నారు.