కాంగ్రెస్, టిడిపి, BRS పొత్తు ఉండబోతుంది – జగ్గారెడ్డి

-

 

 

కాంగ్రెస్, టిడిపి, BRS పొత్తు ఉండబోతుందని

టిడిపి పై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణలో టిడిపి మళ్లీ బతికే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారని అన్నారు. కెసిఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్లడంతో టీడీపీకి ఇప్పుడు మంచి ఎంట్రీ దొరికింది అన్నారు. చంద్రబాబు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడని తెలిపారు జగ్గారెడ్డి. చంద్రబాబు మీద ఎంతమంది మంత్రులు మొత్తుకున్నా లాభం లేదన్నారు.

రాష్ట్రంలో చాలా సమస్యలు ఈ ప్రభుత్వం పట్టించు కోలేదన్నారు. కెసిఆర్ బీఅరెస్ పార్టీ ని ఎక్కడైనా పెట్టుకోవచ్చని.. ఏపీ లో పెట్టుకోవచ్చు… కెసిఆర్ ఏపీ కి వెళ్తున్నాడు… చంద్రబాబు ఇక్కడికి వస్తున్నాడని అన్నారు. కానీ కెసిఆర్ ఏపీ లో సక్సెస్ కాలేడని… చంద్రబాబు తెలంగాణ లో సక్సెస్ అవుతాడని అన్నారు. తెలంగాణ వాదాన్ని కెసిఆర్ మరచిపోయాడన్నారు. టిడిపి ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్న కెసిఆర్ చిన్న రాష్ట్రాల వల్ల ఉపయోగం లేదు అని కెసిఆర్ అన్నాడని గుర్తు చేశారు. కానీ తెలంగాణ వాదాన్ని అడ్డంపెట్టుకుని గెలిచాడన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news