తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా నేతలు ఒకరిపై మరొకరూ విమర్శలు చేసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు కేటీఆర్ కు లేదని మండిపడ్డారు.
140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతికత బీఆర్ఎస్ నాయకులకు లేదని విమర్శించారు. అసలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్) సీఎం అయ్యేవాడా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. “కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో కూల్చివేస్తానని కేటీఆర్ అంటున్నాడు.. నీ వయసు ఎంత? నీ శక్తి ఎంత? వయసుకు మించి మాటలు మాట్లాడుతున్నావు. నీ తండ్రి కేసీఆర్ కూడా కాంగ్రెస్ అనే మర్రి వృక్షం నుంచి వచ్చినవాడే అని మరచిపోయావా” అని కేటీఆర్ మీద నిప్పులు చెరిగారు.