సీఎం కేసీఆర్ డిస్ట్రబ్ అయ్యాడు..ఆయనకు చంద్రబాబు గతే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. కెసిఆర్ ఎటూ కాకుండా పోతారు.. కెసిఆర్ రాజకీయంగా డిస్ట్రబ్ అయ్యాడు.. బీజేపీ నీ బలోపేతం చేసే పనిలో కెసిఆర్ పడ్డారన్నారు. కాంగ్రెస్ 200 ఎంపి సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని.. Trs కి వచ్చే ఎన్నికల్లో ఉన్న ఎనిమిది ఎంపి సీట్లు కూడా గెలవదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ లేకుండా దేశం లో ప్రత్యామ్నాం సాధ్యం అయ్యేది కాదని.. Brs పెట్టీ…తెలంగాణ రాజకీయాన్ని బీజేపీ చేతిలో పెట్టాలని అనుకుంటున్నారని కెసిఆర్ పై సెటైర్ వేశారు. రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. తెలంగాణ లో trs గ్రాఫ్ పడిపోతుందని ఎద్దేవా చేశారు. మాయావతి కంటే… కెసిఆర్ పెద్ద లీడరా..? చక్రం తిప్పిన చంద్రబాబే సైలెంట్ గా ఏపీ కి పరిమితం అయ్యారన్నారు. కెసిఆర్ కి ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని.. కాంగ్రెస్ లేదని… అంటే కెసిఆర్ మానసికంగా బలహీనం గా ఉన్నారు అనుకోవాలని చెప్పారు.