తిరుమల శ్రీవారు అందరి వాడు.. తెలంగాణ భక్తులు రావొద్దా : జగ్గారెడ్డి

-

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జలవివాదాలతో కేసీఆర్, జగన్ లు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకుండా వివాదాన్ని పెంచుతున్నారని మండిపడ్డారు. తిరుమల వేంకటేశ్వర స్వామి అందరి వాడని.. తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలను అనుమతి లేదని జేఈఓ చెప్పడం సరికాదని ఫైర్‌ అయ్యారు.

ఇలాంటి వివాదాలు పెరిగితే రాబోయే రోజుల్లో పెద్ద తుఫాన్ గా మారుతుందని హెచ్చరించారు. దేవుడి వద్ద కూడా రాజకీయాలా ? తెలంగాణ భక్తులు తిరుమలకు రావొద్దా ? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. ఇది దుర్మార్గమైన చర్య అని ఫైర్‌ అయ్యారు. ఇలాంటి వివాదాలు పెంచడం ఇద్దరు సీఎంలకు మంచిది కాదన్నారు. షర్మిల తెలంగాణ కోడలే అయినా ఆమెది రాయలసీమ రక్తమే కదా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. అన్న ఆడా… చెల్లెలు ఈడ .. ఏంటి ఈ నాటకాలని నిలదీశారు. విశాఖ స్టీల్ విషయంలో కార్మికులు రోడ్ల పైకి వచ్చినా సీఎం జగన్ నోరు మెదపరా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news