ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు.. జనసేన కార్యకర్త సూసైడ్

Join Our Community
follow manalokam on social media

బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో జనసేన పార్టీ కార్యకర్త బండ్ల వెంగయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాలుగు రోజుల క్రితం గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు గ్రామ పర్యటన సమయంలో పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి వెంగయ్య, మరికొందరు కార్యకర్తలు తీసుకు వెళ్లారు. ఈ సమయంలో జనసేన కార్యకర్తలపై ఆగ్రహంతో నానా దుర్బాషలాడారు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే తిట్ల పురాణం వీడియోలు వైరల్ కూడా అయ్యాయి.

 

 

అనంతరం జనసేన కార్యకర్త వెంగయ్యను ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనుచరులు బెదిరింపులకు గురిచేసినట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపుల వల్లే వెంగయ్య ఆత్మహత్య చేసుకుని ఉంటాడని జనసేన కార్యకర్తల ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం మానసిక స్థితి సరిగా లేక ఆత్మహత్య చేసుకున్నడంటున్నారు. ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. గ్రామంలో పారిశుధ్య సమస్య తీర్చమని అడిగినా  ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా? అని ప్రశ్నించారు. గిద్దలూరు ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన కార్యకర్త   బండ్ల వెంగయ్య నాయుడు ఆత్మహత్య బాధాకరం అని పేర్కొన్న ఆయన ఆత్మహత్యకు అధికార పక్షం బాధ్యత వహించాలని అన్నారు.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...