కథనం: కమిటీలు ఏర్పడితే కటీఫ్ లే!….

-

జనసేన పార్టీలో విచిత్ర పరిస్థితి చోటు చేసుకుంది. మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సత్తాచాటడం ఖాయమని చెప్పిన కార్యకర్తలే…నేడు ఆ పార్టీకి కటీఫ్ చేప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే దానికి ఓ ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు మరీ. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీని మరో సారి నేరుగా ఎదుర్కొలేక మరో సారి జనసేన నేతలతో దోస్తీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయంగా ప్రస్తుతం చర్చజరుగుతోంది. అలా జరిగితే తమ పార్టీ ఎదగడం కష్టం అని పవన్ భావించడంతో రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో నే అసలు ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయినట్లు తెలుస్తున్నాయి. పార్టీని పటిష్టం చేసేందుకు సంక్రాంతి నుంచి ఇంచార్జీల నియామకాలు ప్రారంభించనున్నట్లు గతంలో పవన్ వెల్లడించారు.

ఒక వేళ అదే జరిగితే.. పార్టీలో అసలు రచ్చ షురూ అవ్వడం ఖాయం అనిపిస్తోంది. ఇప్పటికే మూడు వర్గాలుగా ఉన్న జనసేన పార్టీ సైనికుల్లో … ఓ వైపు పవర్ స్టార్ ఫ్యాన్స్,  పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీ ఆవిర్భావం జరిగిన రోజు నుంచి ఉన్న వారు,ఇంకోవైపు ఇటీవలే కొత్తగా కండువాలు కప్పుకున్న బడా పారిశ్రామిక వేత్తలు గ్రూపులుగా చీలి పోయారు.  అయితే వీరంతా నియోజకవర్గ ఇంచార్జీల పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. గత పార్టీల ఆచారం ప్రకారం నియోజకవర్గాల ఇంచార్జీలకే దాదాపుగా ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయి. దీంతో టిక్కెట్లు ఆశిస్తున్న వారంతా ఆ స్థానానికి పోటీ పడక తప్పదు.

ఎవరైతే పవన్ కల్యాణ్ని ప్రసన్నం చేసుకుంటారో వారికే టికెట్ దొరికే అవకాశం ఉంటుంది. మరి టికెట్ ఆశించి భంగ పడ్డవారంతా మరి పార్టీలో కొనసాగుతారనుకోవడం ప్రశ్నార్థకమే కదా? అయితే ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆచి తూచి అడుగులేస్తున్న పవన్..వీటిని స్వల్ప కాలిక కమిటీలుగా పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రజారాజ్యం అనే పార్టీ పేరుతో చిరంజీవి అభిమానులకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ఇక పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ విషయాని వస్తే వారికి ఏమాత్రం న్యాయం చేస్తారో అనే విషయం పైనే ఆ పార్టీ వర్గాలతో పాటు ఇటు ఇతర పార్టీల నేతల్లోనూ చర్చనీయాంశంగా మారింది. కాస్త అటు ఇటు అయినా సరే వారిని తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ, తెదేపాలు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో కమిటీలు ఏర్పాటు చేస్తే …పార్టీకి కటీఫ్ చెప్పే వారి సంఖ్య గణనీయాంగ పెరగనుందని గుసగుసలు వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news