జనసేన పార్టీకి ఇన్నాళ్ళు అండగా నిలిచింది ఎవరూ పం…!అంటే…? ఎక్కువగా వినపడేది పవన్ కళ్యాణ్ కి ఉన్న అభిమానులే అని ప్రతీ ఒక్కరు మరో ఆలోచన లేకుండా చెప్తారు. సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయినా సరే ఆ పార్టీని పవన్ అభిమానులు దూరం పెట్టలేదు. పాపం పవన్ కి ప్రాణం ఇస్తా౦ జగనన్నకు ఓటు వేస్తామని వాళ్ళు తమ పార్టీని దెబ్బ కొట్టారు. అయితే రెండు నెలల క్రితం ఇసుక సమస్య కోసం,
ఆయన విశాఖలో లాంగ్ మార్చ్ చేసారు. అప్పుడు భారీగా వచ్చారు ఆయన అభిమానులు. ఇదిలా ఉంటే ఇప్పుడు పార్టీ బలోపేతం అయ్యే అవకాశం వచ్చింది. స్థానిక సంస్థల్లో జనసేన పార్టీ పోటీ చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం దాని మీద దృష్టి పెట్టడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండగా ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు. పార్టీ బలోపేతం అయ్యే ఎన్నికలు ఇవే.
గ్రామాల్లో ఉన్న అభిమానులు కార్యకర్తలు అయ్యే తరుణం కూడా ఇదే. కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి ఫాన్స్ ని పార్టీ వైపు తిప్పాలి అంటే ఈ ఎన్నికల్లో గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో సత్తా చాటాలి. కాని పవన్ మాత్రం దృష్టి పెట్టడం లేదు. స్థానిక సంస్థలు జరుగుతాయని అందరికి తెలుసు. కాని పార్టీ మీద దృష్టి పెట్టడం లేదనే వ్యాఖ్యలు ఆయన అభిమానుల్లోనే వినపడుతున్నాయి. మరి ఎప్పుడు పోటీ చేస్తారో, కార్యాకర్తలుగా ఫాన్స్ ఎప్పుడు మారతారో చూడాలి.