సౌత్ లో భారీ డిమాండ్ చేస్తున్న జాన్వి కపూర్.. వర్క్ అవుట్ అవుతుందా..?

-

బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మొదటిసారి తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న.. ఎన్టీఆర్ 30 సినిమాలో జాన్వి కపూర్ భాగం కాబోతోంది. ఇటీవల షూటింగ్ ప్రారంభం కాగా.. సెకండ్ షెడ్యూల్లో జాన్వీ కపూర్ సెట్లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సౌత్ లో అడుగుపెట్టిన మొదట్లోనే ఈమె భారీగా డిమాండ్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇప్పటివరకు ఏ ఒక్క డెబ్యూ హీరోయిన్ కి ఈ రేంజ్ లో పారితోషకం ఇవ్వలేదు . కానీ అడుగుపెట్టగానే ఎన్టీఆర్ సినిమాతో రూ.3.5 కోట్ల మీద పారితోషకం తీసుకుంటుంది.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈమె ఆ తర్వాత కంటెంట్ ఉన్న చిత్రాలనే ఎంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎంత పారితోషకం డిమాండ్ చేసిన సరే ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. మరోవైపు రెండో సినిమా ఛాన్స్ ఏకంగా మెగా పవర్ స్టార్ సరసన కొట్టేసినట్లు సమాచారం. డైరెక్టర్ బుచ్చిబాబు సన , రామ్ చరణ్ కాంబోలో వస్తున్న చిత్రంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఎంపిక అయిందట.

ఇప్పటికే సినిమాకు సంబంధించి సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కానీ ఈ సినిమా కోసం ఈమె ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేస్తోంది అంటూ.. పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుండడంతో ఆమె ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని సమాచారం. మరి ఈమె డిమాండ్ కు దర్శక నిర్మాతలు అంగీకరిస్తారో లేదో చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news