బలగం సినిమాకు 31 అంతర్జాతీయ అవార్డులు

-

బలగం.. ఇప్పుుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఈ పేరే వినిపిస్తోంది. ఇద్దరు సినిమా లవర్స్ ఒకచోట కలిస్తే ఈ చిత్రం గురించి మాట్లాడుకోకుండా ఉండటం లేదు. చిన్న సినిమాగా విడుదలై.. అటు కలెక్షన్స్​లో ఇటు అవార్డుల పంట పండిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది.

కంటెంట్​లో సరైన ఎమోషన్ ఉండి.. ప్రేక్షకుడిని కనెక్ట్ చేసే పాయింట్ ఉంటే.. మూవీ చిన్నదైనా పెద్దదైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా బలగం. అయితే.. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు బలగం సినిమా డైరెక్టర్ వేణు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వేణు మాట్లాడుతూ… బలగం సినిమాను విజయవంతం చేసిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. తన తదుపరి చిత్రం కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేస్తూన్నానని వెల్లడించారు. బలగం చిత్రానికి ఇప్పటి వరకు 31 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి..30 సంవత్సరాలు తరువాత ఉరంతా కలసి చూసే చిత్రం బలగం అవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు డైరెక్టర్ వేణు.

Read more RELATED
Recommended to you

Latest news