జపాన్ ను కుదిపేసిన శక్తివంతమైన భూకంపం…. సునామీ అలెర్ట్ జారీ.

-

జపాన్ దేశాన్ని శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై 7.3గా భూకంప తీవ్రత నమోదైంది. జపాన్ లోని టోక్యోకు ఈశాన్య దిశలో 297 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. జపాన్ లో భూకంప ప్రభావంతో 20 లక్షల ఇళ్లకు పవర్ సప్లై నిలిచిపోయింది. తూర్పు తీరంలోని పుకుషిమా ప్రాంతానికి సమీపంలో ఈ భూకంపం సంభవించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రానికి 60 కిలోమీటర్ల దిగువన భూకంపం సంభవించినట్లు జపాన్ వెల్లడించింది. 

గతంలో తూర్పు ప్రాంతంలోనే 2011లో 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి సునామీ జపాన్ ను ముంచెత్తింది. ప్రస్తుతం కూడా ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఆసమయంలో పుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు తీవ్రంగా దెబ్బతింది. ఆసమయంలో అణు రియాక్టర్ల నుంచి అణు ఇంధనం బయటకు లీక్ కావడంతో తీవ్ర ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం మరోసారి శక్తివంతమైన భూకంపం రావడంతో మరోసారి జపాన్ వాసులు ఉలిక్కి పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news