పంజాబ్ లో గెలుపుతో ఆమ్ ఆద్మీ పార్టీ ఉరకలేస్తోంది. మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు అన్ని సిద్ధం అవుతోంది. ఓ ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైన ఆప్ … ప్రస్తుతం పంజాబ్ లో కూడా పాగా వేసింది. ఇదే విధంగా గోవాలో తన ముద్రవేసింది. రెండు స్థానాల్లో ఆప్ అభ్యర్థులు గెలుపొందారు. పంజాబ్ ఇచ్చిన గెలుపు కిక్ తో హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా తన సత్తా చాటాలనుకుంటోంది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ ను ఫ్యూచర్ పీఎంగా భావిస్తున్నారు ఆపార్టీ నేతలు.
తాజాగా మరో బిగ్ మూవ్ కు సిద్ధం అయింది ఆప్. రాజ్యసభకు ప్రముఖ క్రికెటర్ టర్బోనేటర్ హర్భజన్ సింగ్ ను పంపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హర్భజన్ ను పంపడం వల్ల ఆప్ పార్టీకి మరింత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదనకు హర్భజన్ సింగ్ ఎస్ చెబుతాడో లేదో చూడాలి. గతంలో కూడా హర్భజన్ పలు పార్టీల్లో చేరుతారనే వార్తలు వచ్చాయి. కాంగ్రెస్, ఆప్ ఇలా ఏదో ఒక పార్టీలో పంజాబ్ ఎన్నికల ముందు చేరుతారని వార్తలు వినిపించాయి. ఫైనల్ గా ఆప్ తరుపున చట్టసభల్లోకి అడుగుపెట్టే అవకాశం లభించబోతోంది.