ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వదలడం లేదు. తాజాగా బంగాళాఖాతంలో వాయుగుండం గా మారింది అల్పపీడనం. ఇవాళ మధ్యాహ్నం కి తుఫానుగా మారనుంది ఈ వాయు గుండం. అయితే ఈ తుఫాన్ కు జువాద్ అనే నామకరణం చేశారు వాతావరణ అధికారులు. విశాఖకు 400 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉంది.
అటు పారాదీప్ కు 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఒడిస్సా అలాగే ఉత్తరాంధ్ర తీరాల పై ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఉన్నట్లు వాతావరణ అధికారులు చెప్పారు. ముఖ్యంగా కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతా వరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే గంటకు 100 కిలో మీటర్ల వేగం తో ఈదురు గాలులు వీచే చాన్స్ ఉన్నట్లు తెలిపారు. జవాద్ తుఫాన్ హెచ్చరికలతో ఆందోళన లో రైతాంగం ఉంది. ఇక అటు.. అధికారులు అలర్ట్ అయ్యారు.