యాంకర్ సుమ ”జయమ్మ పంచాయితీ” ఫస్ట్‌ లుక్‌ !

యాంకర్‌ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌ గానే కాకుండా… సినిమాల్లోనూ భిన్న పాత్రలు చేసే సత్తా ఉన్న నటి. అయితే.. ప్రస్తుతం విజయ దర్శకత్వంలో సుమ ఓ సినిమా చేస్తోంది. వెన్నెల క్రియేషన్స్ బ్యాన్‌ర్‌ పై ప్రొడక్షన్‌ నెం. 2 గా తెరకెక్కుతున్న ఈ సినిమా కు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈసినిమా టైటిల్‌.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ రిలీజ్‌ చేశారు. ఈ సినిమా కు ” జయమ్మ పంచాయితీ ” అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. టైటిల్‌ తో పాటు ఫస్ట్‌ లుక్‌ కూడా చాలా వెరైటీ గా ఉంది. విభిన్న అంశాలతో కూడిన పోస్టర్‌ లో గ్రామీణ వాతావరణాన్ని ఆవిష్కరించారు. పోస్టర్‌ ను బట్టి చూస్తే… సినిమాలో సుమ ఓ పల్లెటూరి పెద్ద పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినిమా పై మంచి ఇంప్రెషన్‌ తెచ్చుకుంది. ఇక ” జయమ్మ పంచాయితీ ” ఫస్ట్‌ లుక్‌ తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.