బిగ్ బ్రేకింగ్; టీడీపీకి జేసి దివాకర్ రెడ్డి రాజీనామా…?

-

ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బంది పడుతున్న విపక్ష తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆయన వైఖరి చాలా మంది నేతలకు నచ్చడం లేదనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. అనవసరంగా పార్టీకి అవసరం లేని వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి.

దీనితో కొందరు నేతలు ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. ఇందులో భాగంగానే తాజాగా మరో నేత పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆయనే అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసి దివాకర్ రెడ్డి. ఇప్పుడు పార్టీ కి ఆయన దూరం కావడం ఖాయమని అంటున్నారు. తాజాగా ఆయన వర్గం ఎవరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేది లేదని స్పష్టం చేసారు.

ఇక తన వర్గం నుంచి కొన్నాళ్ళు గా జేసి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక నేతల నుంచి పార్టీ మారాలి అనే ఒత్తిడి ఎక్కువగా జేసికి వస్తుంది. దీనితో ఆయన రాజీనామా చేయడం ఖాయమని అంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వచ్చిన లాభం ఏమీ లేదని, ఇప్పుడు పార్టీ అధికారంలో లేకపోగా నష్టాలు ఎక్కువగా పడుతున్నామని, ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు అన్నీ నష్టపోయాం అనే భావన నేతల్లో ఉంది.

దీనికి తోడు చంద్రబాబుకి చెప్పినా సరే ప్రయోజనం లేదని జేసి కూడా భావిస్తున్నారు. దీనితో ఆయన రాజీనామా చేయడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారని, బిజెపిలో చేరతారని అంటున్నారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక తన సోదరుడు ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ మారడానికి రెడీ అయ్యారని సమాచారం. నేడో రేపో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news