త్వరలో తెలంగాణాలో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కీలక శాఖలను కెసిఆర్ మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఆర్ధిక, రెవెన్యు, ఐటి, మున్సిపల్, జలవనరుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆ శాఖల్లో సమర్ధవంతులు ఉన్నారు. అయితే కొత్త వారిని కేబినేట్ లోకి తీసుకుని పని తీరు మెరుగ్గా లేని వారిని తప్పించే యోచన చేస్తున్నారు కెసిఆర్.
ఇందులో భాగంగానే నిజామాబాద్ ఎంపీ, తన కుమార్తె కవితను కేబినేట్ లోకి తీసుకోవాలని, అలాగే రాజ్యసభ ఎంపీ గా ఉన్న కే కేశవరావు ని కూడా కేబినేట్ లోకి తీసుకోవాలని కెసిఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ముందు వీరిని రాజ్యసభకు పంపాలని కెసిఆర్ భావించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి అవకాశాలు లేని కొందరి నేతల పేర్లను కెసిఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
రాజకీయంగా బలంగా ఉండి, వర్గ విభేదాలు లేని నేతల కోసం ఆయన గాలం వేస్తున్నారు. ఇందులో భాగంగాన పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా మరికొందరి పేర్లు పరిశీలిస్తున్నారు. కేశవరావు… కెసిఆర్ వ్యూహాల్లో చాలా కీలకంగా ఉన్నారు. ఆయనకు ప్రభుత్వ పాలనలో కూడా మంచి అనుభవం ఉంది. పలు శాఖల మీద పట్టు కూడా ఉంది. దీనితోనే ఆయనకు కీలక శాఖ అప్పగించే యోచనలో ఉన్నారు.
అలాగే ఐటి శాఖా మంత్రిగా కవితను నియమించే అవకాశం ఉందని సమాచారం. ఐటి శాఖలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని కెసిఆర్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. అమెరికా వంటి దేశాలు కూడా ఐటి శాఖలో మహిళల ప్రాధాన్యత పెంచే ప్రయత్న౦ చేస్తున్నాయి. ఇండియాకు హైదరాబాద్ ఐటి రాజధాని గా ఉంది. కాబట్టే ఐటి కవితకు అప్పగిస్తే మంచిది అనే భావనలో కెసిఆర్ ఉన్నారని సమాచారం.