నాకు రూ. 3వేల కోట్లు ఇవ్వండి..ధాన్యం పూర్తిగా కొనిపిస్తా : జీవ‌న్ రెడ్డి

త‌న‌కు రూ. 3 వేల కోట్లు ఇవ్వండి.. రైతుల ధాన్యం పూర్తిగా కొనిపిస్తాన‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. రూ. 30 వేల కోట్ల ఆబ్కారీ ఆదాయంలో రైతుల ఆదాయం కూడా ఉందని ఆయ‌న పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల కు ఉన్న రాయితీల, విత్తన రాయితీలను తొలగించి రైతు బంధు ఇస్తున్నావని కేసీఆర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

భూ స్వాములు, బీడీ భూముల కు చెల్లిస్తున్న రైతు బంధు తో రైతుల కు నష్టం జరుగుతుందని ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి. సాగు చేసే , సన్నకారు రైతుల కు రైతు బంధు ఇవ్వండని డిమాండ్ చేశారు జీవ‌న్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిలవరింప చేసే విధంగా తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు..

జిల్లా లో ఆశించిన మేర దిగుబడి లేక పోవడం తో రైతులు నష్టపోతున్నారు.. జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి కి విజ్ఞప్తి చేస్తున్న ఎలక్ట్రానిక్ ధర్మ కంట తుకాన్నీ పరిగణలోకి తీసుకొని రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసేలా మంత్రి కొప్పుల బాధ్యత తీసుకోవాలన్నారు.