ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో మరణించిన వారికి రూ. 50 వేలు పరిహారం ఇచ్చేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిచనుంది. కరోనాతో మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఈ పరిహారం అందనుంది. కరోనా మహమ్మారితో సొంత వారికిన కోల్పోయిన వారికి, లక్షలు లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణాలు దక్కించుకోలేని కుటుంబ సభ్యులకు ఈ పరిహారం ఎంతో కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఓ ఆన్ లైన్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి నోటిఫికేషన్ జారీ చేశారు.
కరోనా బారిన పడి మరణించిన వ్యక్తుల వారసులు ఈ నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నష్టపరిహారం కోసం అప్లై చేసుకునే వారు తప్పని సరిగా మరణించిన వారికి సంబంధించిన కోవిడ్ రిపోర్ట్, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ, ర్యాపిడ్ యాంటి జెన్ టెస్ట్ కానీ, మాలిక్యూలర్ టెస్ట్కు సంబంధించిన రిపోర్టులను జత చేయాలని వెల్లడించింది. కాగా అధికారికంగా ఏపీలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 14478 మంది మరణించారని తెలుస్తోంది. http://covid19.ap.gov.in/exgratia వెబ్ సైట్ లో దరకాస్తు చేసుకోవాలని సూచించింది.