మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మద్యం ధరలను తగ్గించింది జగన్మోహన్రెడ్డి సర్కార్. అయితే ఈ తగ్గిన ధరలు ఇవాళ మధ్యాహ్నం నుంచే అమలులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.
మద్యంపై పన్ను రేట్లలో మార్పులు చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వ్యాట్, అదనపు ఎక్సైజు డ్యూటీ ప్రత్యేక మార్జిన్లల్లో హేతుబద్దత కోసం మార్పులు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం జీవో ప్రకారం.. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వెరెటీలపై 5-12 శాతం మేర ధరలు తగ్గాయి. ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకూ ధరలు తగ్గాయి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం, రాష్ట్రంలో నాటు సారా తయారీని అరికట్టేందుకు ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.