ప్రగతి భవన్ వద్ద జెసి దివాకర్ రెడ్డి హల్ చల్.. అరెస్ట్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అధికారిక నివాసం అయిన ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ మంత్రి జేసీ దివాక‌ర్ రెడ్డి హ‌ల్ చ‌ల్ చేశాడు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోకి వెళ్లాల‌ని.. సీఎం కేసీఆర్ ను క‌ల‌వాల‌ని కాసేపు హంగామా చేశారు. అయితే అపాయింట్ మెంట్ లేనిది ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోకి వెళ్లడానికి అనుమ‌తి ఉండ‌ద‌ని పోలీసులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ ను లేదా మంత్రి కేటీఆర్ ను క‌లుస్తాన‌ని అక్కడే ఉన్నారు.

అయితే సీఎం కేసీఆర్ లేదా.. మంత్రి కేటీఆర్ ఎవ‌రినో ఒక‌రిని క‌లిసేంత వ‌ర‌కు ఇక్క‌డే ఉంటా అని అన్నారు. అంతే కాకుండా ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద ఉన్న పోలీసుల‌తో కూడా జేసీ దివాక‌ర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జేసీ దివాక‌ర్ రెడ్డి అరెస్టు చేశారు. అక్కడ నుంచి పంజా గుట్ట పోలీసు స్టేష‌న్ కు త‌ర‌లించిన‌ట్టు స‌మాచారం. అయితే ఎప్పుడూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తు జేసీ దివాక‌ర్ రెడ్డి వార్త‌ల‌లో నిలుస్తారు. తాజా గా తెలంగాణ ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద హ‌ల్ చ‌ల్ సృష్టించి మ‌రో సారి వార్త‌ల‌లో క‌నిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news