దమ్ముంటే అరెస్ట్ చేయండి.. ఈడీకి ఝార్ఖండ్ సీఎం ఛాలెంజ్

-

అక్రమ మైనింగ్‌ ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌కు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ విచారణకు హాజరుకావాలని ఆదేశించగా.. హేమంత్ సొరేన్ హాజరుకాలేదు.

ఆదివాసీ ముఖ్యమంత్రి అయిన తనను బీజేపీ సర్కార్ వేధిస్తోందని హేమంత్ ఆరోపించారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని అన్నారు. బీజేపీని వ్యతిరేకించే వారి గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తనను దోషిగా భావిస్తే ప్రశ్నించడం ఎందుకు.. నేరుగా వచ్చి అరెస్టు చేయండి అన్నారు. దమ్ముంటే వచ్చి అరెస్టు చేయండని ఈడీకి హేమంత్ ఛాలెంజ్ విసిరారు.

మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టం కింద హేమంత్ సొరేన్‌ను ప్రశ్నిస్తామని, ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే సొరేన్‌ రాజకీయ ప్రతినిధి పంకజ్‌ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ ఏడాది జూన్‌ 8న రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పంకజ్‌ మిశ్రా, అతని సన్నిహితుల ఇండ్లలో సోదాలు జరిపింది.

Read more RELATED
Recommended to you

Latest news