చిన్న వయసులోనే బాలికలను పెళ్లిళ్లు అవుతున్న రాష్ట్రాల్లో జార్ఖండ్ రాష్ట్రం టాప్‌లో నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాలను వెనక్కి నెట్టి మొదటిస్థానంలో చేరింది. 18 ఏళ్లు నిండకుండానే ఈ రాష్ట్రంలో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. దాదాపు 5.8 శాతం మైనర్ బాలికలకు వివాహాలు జరుగుతున్నాయి. కేంద్ర హోంశాఖ నిర్వహించిన శాంపిల్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా మైనర్ బాలికల వివాహం 1.9 శాతంగా ఉందని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ వెల్లడించారు. కేరళలో 0.0 శాతంగా ఉందని పేర్కొన్నారు.
అయితే జార్ఖండ్‌లోని పల్లె ప్రాంతాల్లోనే అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. పల్లెల్లో 7.3 శాతం బాల్య వివాహాలు జరిగితే.. పట్టణ ప్రాంతాల్లో 3 శాతంగా ఉన్నాయి. అలాగే 21 ఏళ్లలోపు యువతులకు పెళ్లిళ్లు అవుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. 54 శాతం యువతులు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. జార్ఖండ్‌లో 21 ఏళ్లలోపు పెళ్లిళ్లు అవుతున్న వారి సగటు 54.6 శాతంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా దీని సగటు 29.5 శాతంగా ఉంది.