టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు 5 గురు బీజేపీలో విలీనం కాబోతున్నారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మరొకరితో చర్చలు జరుపుతున్నారని ఆయన కూడా రెడీ అయితే.. అందరూ కలిసి బీజేపీలో విలీనం అవుతారని జోష్యం చెప్పారు. దీనికి కారణం జోగినిపల్లి సంతోష్ అని ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హీట్ ఎక్కాయి.
అటు ఈసీ నిబంధనలను కేసీఆర్ ఉల్లంగించారని ఆరోపించారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. గులాబీ కూలి పేరుతో చాలామందిని టిఆర్ఎస్ నేతలు వేధించారని, ఈసీ నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలు ఏవి రూ. 20 వేలకు మించి నగదు తీసుకోవద్దని గుర్తు చేశారు. ఏటా చూపించవలసిన బ్యాలెన్స్ షీట్ కూడా టిఆర్ఎస్ చూపించడం లేదని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సీఎం, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఉద్యోగులేనని.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నిబంధనలే వాళ్లకు వర్తిస్తాయని అన్నారు.