రాజన్న సిరిసిల్ల జిల్లా : షుగర్ మహమ్మారి చాలా మందిని వనికి ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షుగర్ మహమ్మారి వ్యాధి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు కూడా సోకింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించడం గమనార్హం. వేములవాడ లో పర్యటించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. “నాకు షుగర్ ఉందని పరీక్షలు చేసుకోవడం వలన 16 ఏళ్ల క్రితమే నాకు తెలిసింది…అప్పటి నుండి జాగ్రత్తగా ఉంటున్నాం” అని వెల్లడించారు.
65, 70 ఏళ్లలో కానీ పనులు, మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా సాధ్యం అవుతున్నాయని…ఆరోగ్య తెలంగాణ లక్ష్యం లో భాగంగా 220 టీమ్స్ తో ఇంటింటికి వచ్చి పరీక్షలు చేస్తారని వెల్లడించారు. హైట్, వెయిట్, బీపీ, షుగరు, హార్డ్, కిడ్నీ, ఇతరత్రా డేటా ను ట్యాబ్ లో అప్లోడ్ చేస్తారని తెలిపారు.
అక్కడే కంటి పరీక్ష కూడ చేస్తారు, అలాగే రక్ష పరీక్షలు చేస్తారని.. రాబోయే 60 రోజుల్లో పరీక్షలు పూర్తి అవుతాయన్నారు.. మన హెల్త్ కార్డు ఉండడం వలన ఆరోగ్య డేటా తో ఏమెర్జెన్సీ లో కాపాడడాం చాల సులభమని.. హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండడం వలన అన్ని రకాలుగా ఉపయోగాలు, ఏ దవాఖానకు కి వెళ్లిన డేటా క్లియర్ ఉంటుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.