టిడిపి ఇన్చార్జ్ పై వైసీపీ శ్రేణుల దాడి.. మండిపడిన లోకేష్

-

చిత్తూరు జిల్లా నంజంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడిపి, వైసీపీ శ్రేణుల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. టిడిపి నాయకుల కార్లు ధ్వంసం అయ్యాయి. టిడిపి పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి చల్లబాబుని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. “మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి క‌నుస‌న్న‌ల్లో పుంగ‌నూరు, తంబ‌ళ్ల‌ప‌ల్లెలో వైసీపీ ఫ్యాక్ష‌న్ ముఠాలు అరాచ‌కాలకు పాల్ప‌డుతున్నాయి. చిత్తూరు జిల్లా సోమ‌ల‌ మండలం నంజంపేటలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వ‌హించ‌కుండా వైసీపీ అడ్డుకోవ‌డం అప్ర‌జాస్వామికం. టీడీపీ నేత చల్లా రామచంద్రారెడ్డి, టిడిపి కార్యకర్తలపై రాళ్ల‌దాడి చేసిన‌ వైసీపీ మూక‌ల తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాను. చ‌ట్టాన్ని గౌర‌విస్తూ వ‌స్తున్నాం. దాడులు తీవ్ర‌మైతే ప్ర‌తిదాడులూ ఉంటాయ‌ని పుంగ‌నూరు డాన్ గుర్తుంచుకుంటే మంచిది” అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news