మీరు ఇంజినీరింగ్ పూర్తి చేసారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దీనికి సంబందించిన నోటిఫికేషన్ ని కూడా ఇండియన్ రైల్వేస్ విడుదల చేసింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన జబల్‌పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్ట్ సెంట్రల్ రైల్వే లో ఖాళీలు వున్నాయి.
ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇండియన్ రైల్వే కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను ఇండియన్ రైల్వేస్ భర్తీ చేస్తోంది.
అయితే వీటిలో జూనియర్ టెక్నికల్ అసోయేట్, జూనియర్ టెక్నికల్ అసోయేట్ పోస్టులు వున్నాయి. వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లై చేసుకోవాలంటే కచ్చితంగా ఇంజనీరింగ్ డిగ్రీ/ డిప్లొమా ప్యాస్ అయ్యి ఉండాలి.
ఇక ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనేది చూస్తే.. అభ్యర్థులను మొదట స్క్రీనింగ్, ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది కాంట్రాక్ట్ కాలవ్యవధిలో పని చెయ్యాలి. అప్లై చేసుకోవడానికి 17-03-2022ని చివరి తేదీ. పూర్తి వివరాలను https://wcr.indianrailways.gov.in/ లో చూసి అప్లై చేసుకోచ్చు.