టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఏకంగా 1061 ఖాళీలు…!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ పలు పోస్టులని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. డీఆర్‌డీవో ఎంట్రన్స్‌ టెస్టు కి సంబంధించి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్‌-10/ఎ&ఎ) అడ్మిన్ & అలైడ్ కేడర్ కోసం నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు.

దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 ఖాళీలు వున్నాయి. ఇక అర్హత వివరాలని చూస్తే.. 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ ప్యాస్ అయ్యి ఉండాలి. టైపింగ్‌ పరిజ్ఞానం, డ్రైవింగ్‌ లైసెన్స్ తప్పక ఉండాలి. వయస్సు విషయానికి వస్తే 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

పోస్టుల వివరాలను చూస్తే.. జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (జేటీవో) 33 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1(ఇంగ్లిష్ టైపింగ్) 215 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2(ఇంగ్లిష్ టైపింగ్): 123 పోస్టులు వున్నాయి. అలానే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ‘ఎ’ (ఇంగ్లిష్ టైపింగ్) 250 పోస్టులు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ‘ఎ’(హిందీ టైపింగ్) 12 పోస్టులు వున్నాయి. అదే విధంగా స్టోర్ అసిస్టెంట్ ‘ఎ’(ఇంగ్లిష్ టైపింగ్) 134 పోస్టులు, స్టోర్ అసిస్టెంట్ ‘ఎ’(హిందీ టైపింగ్) 04 పోస్టులు, సెక్యూరిటీ అసిస్టెంట్ ‘ఎ’ 41 పోస్టులు, వెహికల్ ఆపరేటర్ ‘ఎ’ 145 పోస్టులు, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ‘ఎ’ 18 పోస్టులు, ఫైర్‌మ్యాన్ పోస్టులు 86 వున్నాయి.

ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. దరఖాస్తు ఫీజు రూ.100 గా వుంది. టైర్-1 (సీబీటీ), టైర్-2 ని చూసి ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ డిసెంబర్‌ 7, 2022. పూర్తి వివరాలని https://www.drdo.gov.in/ceptm-advertisement/1782 లో చూసి అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news