ఇంగ్లాండ్ లోనే లార్డ్స్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్యన యాషెస్ రెండవ టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ ఓడిపోయిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆడుతోంది, నిన్న ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా అయిదు వికెట్లను కోల్పోయి 339 పరుగులు చేసింది. మాములుగా మూడు వికెట్లతోనే ఇనింగ్స్ ను ముగించాల్సింది. అయితే ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జో రూట్ ఒకే ఓవర్ లో రెండు వికెట్లను తీయడం ద్వారా స్వల్ప వ్యవధిలోనే అయిదు వికెట్లకు పడిపోయింది. ఈ ప్రదర్శనతో జో రూట్ అరుదైన రికార్డును అందుకున్నాడు. దశాబ్దాల చరిత్ర కలిగిన యాషెస్ టెస్ట్ సిరీస్ లో 2 వేల పరుగులు మరియు 20 వికెట్లు తీసిన ఆటగాడిగా ఇతను చరిత్ర పుటల్లోకెక్కాడు. ఇప్పటికి వరకు ఈ గణాంకాలను అందుకున్న వారిలో ఆర్మ్ స్ట్రాంగ్ మరియు హమాండ్ లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఇప్పుడు జో రూట్ మూడవ స్థానానికి వచ్చి చేరాడు. మరి ఇదే జోరును ఈ సిరీస్ లో కొనసాగించి యాషెస్ సిరీస్ ను జట్టుకు అందిస్తాడా చూడాలి.