AP : రేపు ఎన్డీయే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..వారికి శుభవార్తే !

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి మేనిఫెస్టోను ఎన్డీఏ కూటమి రేపు విడుదల చేయనుంది. వైసీపీ మెనీఫెస్టో ఇప్పటికే విడుదలైంది. టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం పేర్లతో చూచాయగా తమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి.

Joint manifesto of NDA will be released tomorrow

ప్రధానంగా పెన్షన్ పై కూటమి దృష్టి పెడుతున్నట్లు సమాచారం. క్రమంగా పెన్షన్ ను పెంచుకుంటూ వెళ్తామని వైసీపీ అంటుండగా….తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ. 4వేల పెన్షన్ ఇస్తామని కూటమి హామీ ఇస్తోంది.

కాగా,జనసేన తరపున మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత యాక్టర్ పృథ్వీ వెల్లడించారు. మే 5 నుంచి 11 వరకు జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో చిరంజీవి పాల్గొంటారని తెలిపారు. కూటమి అభ్యర్థులు గెలవాలని షూటింగ్ పక్కన పెట్టి ప్రచారం చేస్తారన్నారు. ఇప్పటికే మెగాస్టార్ కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news