దుబ్బాక ధమాకాతో హుజూరాబాద్ ఓటమితో కేసీఆర్ కష్టాలు మొదలయ్యాయి: జేపీ నడ్డా

-

దుబ్బాక ధమాకాతో, హూజూరాబాద్ ఓటమితో హుజూర్ తలపొగరు తగ్గిందని… కేసీఆర్ కష్టాలు మొదలయ్యాయని అన్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. మోదీ సారథ్యంలో కేంద్రంలో బాధ్యతాయుత సర్కార్ ఉందని ఆయన అన్నారు. దేశంలో అత్యంత అవినీతి సర్కార్ టీఆర్ఎస్ సర్కారే అని విమర్శించారు. కరోనాతో అమెరికా, ప్రాన్స్, ఇటలీ దేశాలు తీవ్రంగా నష్టపోతుంటే… మోదీ సారథ్యంలోని భారత్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోందని ఆయన అన్నారు. మనం అంతా మాస్కులు లేకుండా ఇక్కడ ఉన్నామంటే 190 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన మోదీ సర్కార్ కారణం అన్నారు. కరోనా ప్రోటోకాల్ ను కేసీఆర్ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కావాాలని కోరుకుంటున్నారని జేపీ నడ్డా అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కేసీఆర్ సర్కార్ ప్రజలకు చేరకుండా చేస్తోందని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో తీసుకువచ్చేందుకు బీజేపీని గెలిపించుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు ఏటీఎంగా మారిందని విమర్శించారు. రూ. 20 వేల కోట్ల ప్రాజెక్ట్ ను 1.20 లక్షల ప్రాజెక్ట్ గా మార్చారని విమర్శించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ సమితి అని… ప్రజలను  విభజించి పాలిస్తున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news