నా స్నేహితుడితో పడుకో.. అంటూ భార్యకు వేధింపులు..

-

ప్రపంచ దేశాలు భారత సంస్కృతిని చూసి నేర్చుకుంటుంటే.. కొందరు పాశ్చాత పోకడలను నేర్చుకుంటున్నారు. కొన్ని దేశాల్లో గ్రూప్ సెక్స్, వైఫ్ షేరింగ్ లాంటి చెండాలపు అలవాటు ఉంది. అయితే అలాంటి సంస్కృతిని నేర్చుకుంటూ ఇక్కడికి వచ్చి… దేశంలో ప్రయోగిస్తున్నారు..అలాంటి ఘటనే ఇది.. ఇండియాకు చెందిన తరుణ్ (పేరు మార్చాము) విదేశాల్లో చదువుకొని.. అక్కడే ఉద్యోగం చేసేవాడు.. `అయితే తనకు ఇండియాకు చెందిన అనూష (పేరు మార్చాము) యువతితో 3 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. అయితే.. పెళ్లి తరువాత.. తన భార్య అనూషను తరుణ్ విదేశాలకు తీసుకెళ్లాడు. అయితే.. 2 సంవత్సరాలు వారి వైవాహిక జీవితం బాగానే సాగింది.

కానీ.. ఓ సంవత్సరం నుంచి.. అనూషను తరుణ్ వేధింపులకు గురిచేయ సాగాడు. అనూష వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనో .. లేక ఇంకో విషయమో కాదు.. అనూషను తన స్నేహితుడితో పడుకొమ్మని తరుణ్ వేధింపులకు గురిచేసేవాడు. అంతేకాకుండా.. మా స్నేహితుడి భార్యతో నేను.. నా స్నేహితుడితో నువ్వు శృంగారం చేద్దామంటూ రోజూ అనూషను వేధింపులకు గురిచేసేవాడు.. అయితే భార్యాభర్తలు ఇద్దరు ఓసారి ఇండియాకు వచ్చారు.. రాగానే తరుణ్ తతంగం అంతా తల్లిదండ్రులకు చెప్పి.. తరుణ్ పై అనూష పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ ఘటనను బయటకు రాకుండా.. సామరస్యంగా పరిష్కరించేందుకు తరుణ్ తల్లిదండ్రులు మంతనాలు చేస్తున్నట్లు సమాచారం..

Read more RELATED
Recommended to you

Latest news